తాజా వార్తలు

Thursday, 12 November 2015

2019లో బరిలోకి దిగనున్న జనసేన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్   మీడియాతో మాట్లాడారు. 2019 నాటికి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ తెలిపారు. కాగా ఈ భేటీలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై చంద్రబాబుతో చర్చించలేదన్నారు. జనసేన పార్టీని విస్తరించేందుకు తన వద్ద డబ్బు లేదని పవన్ కల్యాణ్ అన్నారు.   ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు నేను రాలేకపోయా. శుభాకాంక్షలు తెలిపేందుకే బాబును కలిశా. రాజధాని నిర్మాణం సందర్భంగా నా దృష్టికి వచ్చిన పలు సమస్యలను సీఎం ముందుంచా. ముఖ్యంగా బాక్సైట్ తవ్వకాలపై చర్చించాం. గిరిజనుల జీవితాలు దెబ్బతినకుండా చూడాలని కోరా. చర్చించిన తర్వాతే బాక్సైట్ తవ్వకాలపై ముందుకెళ్తామన్నారు. 

అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించాం. ప్రధాని నుంచి తుది ప్రకటన వచ్చాక స్పందిస్తాం. బీజేపీ ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చాల్సిందే. ప్రజలకు చెడు జరిగితే మాట్లాడటానికి ఏమాత్రం వెనుకాడను. సమస్యల పరిష్కారానికి కేంద్రానికి డెడ్‌లైన్ పెట్టే స్థాయి నాకు లేదు. ఆందోళనలను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోదు. పద్ధతి ప్రకారమే ఏదైనా సాధించుకోవాలన్నారు. 

జనసేనకు రాజకీయ పార్టీ గుర్తింపుపై విలేకరులు ప్రశ్నించగా జనసేనను రాజకీయపార్టీగా మార్చడానికి, పార్టీని విస్తరించడానికి తన వద్ద అంత డబ్బు లేదని తెలిపారు. అయినప్పటికి 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పేర్కొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment