తాజా వార్తలు

Monday, 23 November 2015

డిసెంబర్ 7న లోఫర్ ఆడియో విడుదల

లోఫర్ సినిమా ఆడియో విడుదల ముహూర్తాన్ని నిర్మాతలు ఖరారు చేశారు. వరుణ్ తేజ హీరోగా పూరి జగన్నాథ్దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'లోఫర్'. సి.కె.ఎంటర్టైన్మెంట్స్ప్రై. లిమిటెడ్సి.కళ్యాణ్సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్పతాకంపై సి.కళ్యాణ్నిర్మిస్తున్నారు. చిత్రం ఆడియో ని, సినిమా విడుదల తేదీలను ఖరారు చేసారు నిర్మాతలు. సి. కళ్యాణ్ మాట్లాడుతూ- ''వినోదం, మదర్ సెంటిమెంట్, హై యాక్షన్ చిత్రంలో ఉంటాయి. తక్కువ సమయంలో ట్రైలర్‌కి పది లక్షల క్లిక్స్ వచ్చాయి. పూరి దర్శకత్వంలో వచ్చిన రవితేజకు 'ఇడియట్', మహేశ్‌కు 'పోకిరి', ఎన్టీఆర్‌కు 'టెంపర్', రామ్ చరణ్‌కు 'చిరుత', అల్లు అర్జున్‌కు 'దేశముదురు'లా వరుణ్ కెరీర్లో చిత్రం మంచి మాస్ సినిమాగా మిగిలిపోతుంది. డిసెంబర్ 7 పాటలను, 18 చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు. వరుణ్తేజ్మాట్లాడుతూ ''నా కెరీర్బిగెనింగ్లోనే పూరి జగన్నాథ్వంటి పెద్ద డైరెక్టర్‌తో పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. లోఫర్సబ్జెక్ట్వినగానే ఎంతో ఎగ్జైట్అయ్యాను. పూరిగారి దర్శకత్వంలో వస్తోన్న చిత్రం మంచి మాస్‌ఎంటర్‌టైనర్‌గా అందర్నీ ఆకట్టుకుని నా కెరీర్‌కి టర్నింగ్పాయింట్అవుతుంది'' అన్నారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment