తాజా వార్తలు

Wednesday, 11 November 2015

అఖిల్ రివ్యూ

వాయిదాలు మీద వాయిదాలు పడుతూ వచ్చినా సినిమా అఖిల్  రిలీజ్ అయ్యింది. సినిమాలో అఖిల్...బాగా కష్టపడ్డాడనే చెప్పాలిసరదా కుర్రాడు అఖిల్ (అఖిల్ అఖినేనిమెడికల్ స్టూడెంట్ దివ్య (సాయేషా)తో ప్రేమలో పడతాడురాజేంద్రప్రసాద్ తో కలిసి ఆమె కుటుంబాన్ని ఇంప్రెస్ చేస్తూంటాడుఇలా వీరి ప్రేమ కథ నడుస్తూండగా...ఆమె కిడ్నాప్ కు గురి అవుతుందిఆమెను వెతుక్కుంటూ ఉంటే ఆమె ఆఫ్రికాలో ఉందని తెలుస్తుందిమరో ప్రక్క జర్మన్ సైంటిస్ట్ కత్రోచి...జువా ని తన గుప్పెట్లో పెట్టుకుని అతీత శక్తులతో ప్రపంచాన్ని ఏలాలని ప్రయత్నిస్తూంటాడుఇది తెలియని అఖిల్...దివ్యను వెనక్కి తేవటం కోసం బ్రహ్మానందంతో కలిసి కొందమంది ట్రైబర్ తెగ సాయిం తీసుకుని బయిలు దేరతాడువారితో కలిసి జర్నీ చేస్తున్న సమయంలో కొన్ని సంఘటనలు జరుగుతాయిఅవే అతని జీవితాన్నిలక్ష్యాన్ని సమూలంగా మార్చేస్దాయి సంఘటనలు ఏమిటి..జువాకు అఖిల్ కు సంభంధం ఏమిటి..అతను తన గర్ల్ ఫ్రెండ్ ని చేరుకున్నాడావిలన్ నుంచి జువాని రక్షించి ప్రపంచాన్ని రక్షించాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా కథ కేవలం నామమాత్రంగా సాగుతూ...పూర్తిగా అఖిల్ అన్ని ఎమోషన్స్ చూపగలడు, డాన్స్ లు ఫైట్స్ మాత్రం తగ్గకుండా చేయగలడు అని ప్రమోట్ చేస్తూ చెప్పగలిగే... షో రోల్ గా సాగింది. అయితే సినిమాలో కీ ఎలిమెంట్స్ తో ఎమోషన్ ఎటాచమెంట్ మిస్సవటం, కథనం చాలా సేపు ప్లాట్ గా సాగటం, కామెడీ పేరుతో వచ్చే ఎపిసోడ్స్ ఇబ్బంది పెడతాయి. అయితే ఏదైతే సినిమా ద్వారా తండ్రి నాగార్జున, దర్శకుడు వినాయిక్నిర్మాత నితిన్ కోరుకున్నారో అది మాత్రమే నెరివేరినట్లు కనిపిస్తోంది. అఖిల్ సినిమా నుంచి సగటు ప్రేక్షకుడు కోరుకునే కిక్ మాత్రం అసలు దొరకలేదు.  ఇంతకు ముందు మన తెలుగు కథలు...తనని లేదా తన కుటుంబాన్ని సేవ్ చేసుకునేవాడిగా వచ్చాయి. తర్వాత తరంలో తన ఊరుని ..విలన్స్ నుంచి రక్షిస్తే... కొద్ది కాలం తర్వాత హీరోలు మొత్తం రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించే కథలూ వచ్చాయి. అయితే అటువంటి కథలు ఇమేజ్ ఉన్న మాస్ హీరోలు మాత్రమే చేసేవారు. ఇప్పుడు అఖిల్ తొలిచిత్రంతోనే..ఏకంగా ప్రపంచాన్నే రక్షించే పనిలో పడ్డాడు. సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇదే సబబు అని భావించారేమో. ఇక ఇలాంటి కథలు గతంలో తెలుగులో దేవిపుత్రుడు,అంజి అంటూ వచ్చాయి. అలాగే హాలీవుడ్ లో ఇండియానా జోన్స్, లారా క్రాప్ట్ టాంబ్ రైడర్ ఇంకా మరెన్నో చూసే ఉంటాం. అలాగే చాలా విజువల్స్ ఫిరానా, అవతార్ లను గుర్తు చేస్తే హెలీకాప్టర్ సీక్వెన్స్, వల్కనో బరస్ట్ అవటం వంటివి పూర్తిగా హాలీవుడ్ సినిమాల నుంచి తీసుకున్నవే అని అర్దమవుతూ ఉంటుంది. అయితే ఇది ప్రస్తుతం తెలుగులో నడుస్తున్న ట్రెండ్ ని ఢిఫెర్ చేసే  కథే...అయితే ట్రీట్ మెంట్, స్క్రీన్ ప్లే విషయంలో దాన్ని పరమ రొటీన్ గా మార్చేసారు. ఇంతకాలం అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోలందరూ క్లాస్ సినిమాలకే పరిమితం అవుతూ వస్తున్నారు...అప్పుడప్పుడూ మాస్ లుక్ కి ట్రై చేసినా దారిలో పూర్తి ప్రయాణం పెట్టుకోలేదు.కానీ అఖిల్ తొలి చిత్రం నుంచే మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేసాడని అర్దమవుతోంది. తొలి చిత్రానికి దర్శకుడుగా గౌతమ్ మీనన్ నో, మణిరత్నం నో ఎన్నుకోకుండా మాస్ చిత్రాల దర్శకుడు వినాయిక్ ని ఎన్నుకోవటంలోనూ, డాన్స్ లు, ఫైట్స్ ని అఖిల్  తీరులో అది మనకు స్పషమవుతుంది. హీరోగా అఖిల్ కు మాత్రమే ఇది ఎంట్రీ చిత్రం కాదు...హీరోయిన్ సాయేషాకు ఇదే తొలి చిత్రం. ఆమె డీసెంట్ గా గ్లామర్ తో ఎక్కడా తడబాటు లేని డైలాగ్ డెలివరితో,చాలా చోట్ల అఖిల్ కు డాన్స్ లలో పోటీ ఇస్తూ చేసింది. చూస్తూంటే సాయేషా తెలుగులో స్ధిరపడేటట్లే కనపడుతోంది. ఇది వినాయిక్ కష్టం... కొత్త హీరోని, అదీ ఎన్నో ఎక్సపెక్టేషన్స్ ఉన్న కుర్రాడిని లాంచ్ చేయమని,అదీ మాస్ స్టార్ గా రెడీ చేయమని అప్పగించినప్పుడే వినాయిక్ పై భాధ్యత బాగా పెరిగింది. అందుకు తగినట్లే ఆయన చాలా థిన్ గా ఉన్న స్టోరీ లైన్ తీసుకుని, తన దైన శైలిలో హీరోయిజం ఎలివేట్ చేస్తూ, కుర్రాడు అన్నీ చేయగలడు అని చెప్పేందుకు తగినట్లుగా సీన్స్ అల్లుకుంటూ వచ్చారు. రీసెంట్ గా బెల్లంకొండ కొడుకుని లాంచ్ చేసిన అనుభవం ఇక్కడ బాగా పనికి వచ్చిందనే చెప్పాలి. పాటల భాధ్యత మంచి స్పీడులో ఉన్న తమన్, అనూప్ తీసుకున్నారు. పాటలు రిలీజ్ కు ముందు బాగా ఎక్కకపోయినా పిక్చరైజేషన్ బాగుండటం,అఖిల్ కూడా స్టెప్ లతో చెలరేగిపోవటంతో జనాల్లోకి ఇప్పుడు బాగా వెళ్తాయి. ముఖ్యంగా చిల్ మారో, పడేసావే, అక్కినేని అక్కినేని సాంగ్ లు బాగున్నాయి. రీరికార్డింగ్ స్పెషలిస్టు మణిశర్మ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది. చాలా సీన్స్ కు ఆయన ప్రాణం పోసాడనే చెప్పాలి. రీరికార్డింగ్ లేకపోతే వాటిని ఊహించలేం అన్నట్లుగా సాగాయి. కామెడీ రిలీఫ్...వినాయిక్ చిత్రాల్లో తొలి నుంచీ కామెడీ కు ప్రయారిటీ ఇస్తూనే వస్తున్నారు.  
 
« PREV
NEXT »

No comments

Post a Comment