తాజా వార్తలు

Monday, 2 November 2015

దీపావళి కానుకగా అఖిల్..!

అఖిల్ మువీకి మోక్షం క‌లిగేలా క‌నిపిస్తోంది. ఎట్టకేల‌కు విడుదల తేదీకి మ‌ళ్లీ ముహూర్తం ఖ‌రార‌య్యింది. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మొదటి సినిమా అఖిల్ వచ్చే నెల దీపావళి రోజునే రాబోతున్న‌ట్టు స‌మాచారం. ప్రస్తుతం అందుకు సంబందించిన కార్యక్రమాలు జరుగుతున్నాయని అంటున్నారు. మొదట అనుకున్న ప్రకారం ఈ సినిమా దసరా రోజునే విడుదల కావలసి ఉన్నది. అయితే గ్రాఫిక్స్ కి సంబందించిన పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో, విడుదల తేదిని నవంబర్ 11కి మార్చామని అంటున్నారు చిత్ర యూనిట్. అయితే ఈ తేది దగ్గరపడుతున్నా ఎటువంటి సందడి కనిపించకపోవడంతో, అందరిలోనూ సందేహం తలెత్తింది. ఈ నేపధ్యంలో ఈ సందేహాలకి దర్శకనిర్మాతలు త్వరలో తేరా దించనున్నట్లు సమాచారం దీపావళి కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా యూనిట్ శ్రమిస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరుకి సి.జి వర్క్ పూర్తి చేసి నవంబర్ 11న విడుదల చేయడానికి సిద్దం అవుతున్నారని అంటున్నారు. మరి ఈ దీపావళికి అఖిల్ ఏ రేంజ్ లో సందడి చేస్తాడో చూడాలి.
« PREV
NEXT »

No comments

Post a Comment