తాజా వార్తలు

Thursday, 5 November 2015

కమల్ తో అమల..?

దాదాపు 25ఏళ్ల తర్వాత అమల కమలహాసన్‌తో నటించడానికి సిద్ధమవుతున్నారని వార్తలు గుప్పు మంటున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జునను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత దాదాపుగా నటనకు దూరం అయ్యారనే చెప్పాలి. సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల వెండితెర, బుల్లితెరపై ప్రత్యక్షమయ్యారు. తాజాగా తమిళం, తెలుగు భాషలలో తెరకెక్కనున్న ఒక భారీ చిత్రంలో విశ్వనటుడు కమలహాసన్‌తో నటించడానికి సిద్ధమవుతున్నారు. కమల్ నటించిన తూంగావనం ఈనెల 10న విడుదల కానుంది. చీకటిరాజ్యం పేరుతో తెలుగులో 20వ తేదీన తెరపైకి రానుంది. దీంతో కమలహాసన్ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ఆయనకు జంటగా అమల నటించనున్నారని ఫిలీం నగర్ టాక్..  
« PREV
NEXT »

No comments

Post a Comment