తాజా వార్తలు

Tuesday, 3 November 2015

62రోజులకు చేరిన ఆశావర్కర్ల సమ్మె


 
సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి తెలంగాణలోని 25 వేల మంది ఆశ వర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం 62 రోజులుగా సీఐటియు ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నారు. రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, ధర్నాలు, చలో అసెంబ్లీ లాంటి వివిధ రూపాల్లో ఆశ వర్కర్లు తమ నిరసన తెలిపినా తెలంగాణ ప్రభుత్వం దిగిరాలేదు. అందుకే సర్కారు కొమ్ములు విరిచేందుకు సమ్మెను ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సీఐటియు ఆధ్వర్యంలో ఈ నెల 6, 7 తేదీల్లో అన్ని జిల్లాల్లో DMHO కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకమైనా ఆశ వర్కర్లు చేయని సేవలు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు, సలహాలు, సూచనలు అందించడంలో వీరి పాత్ర కీలకమైనది. ప్రభుత్వ పథకాల సర్వేలు, బిఎల్ వో, పోలియో, ఇమ్యునైజేషన్, టీకాలు, ప్రభుత్వ హాస్పటల్‌లో ప్రసవం జరిగేలా చూడటం, గర్భిణులకు సలహాలు అందించటం ఇలా గ్రామాలను ఆరోగ్యవంతంగా తయారు చేయడంలో ఆశ వర్కర్ల సేవలు అమోఘమైనవి. ఇంత చేస్తున్నా వీరికి నెలకు ఇచ్చేది 300ల నుంచి 400ల రూపాయలు మాత్రమే.
 
« PREV
NEXT »

No comments

Post a Comment