తాజా వార్తలు

Sunday, 29 November 2015

ఆదార్ కార్డుకు,పదో తరగతికి లింకేమిటో

ప్రభుత్వం అన్నాక ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఉండాలేమో. తెలంగాణలో పదో తరగతి విద్యార్ధులు పరీక్షకు హాజరు కావాలంటే తప్పనిసరిగా ఆదార్ కార్డు ఉండాలన్న కొత్త నిబందన పెట్టారు. సంక్షేమ పదకాల కోసం పెట్టారా?వ్యవస్థలను క్రమబద్దం చేయడానికి ఈ నిబందన పెట్టారో తెలియదు కాని, దీనివల్ల లక్షన్నర మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాసే అవకాశం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.ప్రైవేటు స్కూళ్ళు సైతం ఆదార్ కార్డ్ నెంబర్ లతో సహా నామినల్ రోల్స్ ఇవ్వవలసి ఉంటుంది.తెలంగాణ వ్యాప్తంగా ఆరు లక్షల మంది వ్యార్దులు పదో తరగతిలో ఉంటే, వారిలో లక్షన్నర మందికి ఆధార్ కార్డులు లేవని చెబుతున్నారు.ఇప్పటికిప్పుడు ఆదార్ కార్డు సమకూర్చడం కష్టం కూడా. అలాంటప్పుడు ఇది సాద్యమయ్యేదేనా అన్న ప్రశ్న వస్తుంది.సుప్రింకోర్టు డైరెక్షన్ కూడా పట్టించుకోకుండా ఇలాంటి ఆదేశాలు ఎలా ఇస్తారో అదికారులు?
« PREV
NEXT »

No comments

Post a Comment