తాజా వార్తలు

Thursday, 19 November 2015

అబ్బాయితో అమ్మాయి ఓ సోషల్ నెట్ వర్క్ కథ

'అబ్బాయితో అమ్మాయి' ట్రైలర్‌ విడుదల అయ్యింది. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగశౌర్య, పల్లక్ లాల్వానీలు హీరో హీరోయిన్లుగా, కిరీటి పోతిని నిర్మిస్తున్నారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా దీనికి సంగీతాన్ని సమకూర్చారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ప్రస్తుతం సోషల్ మీడియా హవా ఎక్కువగా నడుస్తోందని, ప్రధానంగా యువత ఇందులో ఎక్కువ సమయం గడుపుతున్నారని తెలిపారు. అయితే సోషల్ మీడియలో ఒక రకంగా, బయట మరో రకంగా ప్రవర్తించే వారు కూడా ఈ సమాజంలో ఉన్నారని అన్నారు. అలాంటి ఒక అబ్బాయి, ఒక అమ్మాయిల కథనే సినిమాగా తీశామని పేర్కొన్నారు. ట్రైలర్ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినిమా యూనిట్ సభ్యులు తెలిపారు.   
« PREV
NEXT »

No comments

Post a Comment