తాజా వార్తలు

Thursday, 12 November 2015

దుమ్ము రేపుతున్న రాయే రాయే

బెంగాళ్ టైగర్ ట్రిపుల్ ధమాకా సాంగ్ టీజర్ వచ్చింది. ఈ పాట కోసం మిల్కీ సైరన్ తమన్నా.. క్యూట్ బ్యూటి రాశి ఖన్నా..అందాలను ఆరబోశారు. మాస్ రాజా రవితేజ కోసం.. ఇప్పటికే  ఈ సినిమాలో తమ అందాలతో పోటీ పడుతున్నారు. ఇద్దరూ కలసి మరీ ఒకే పాటలో పోటీ పడుతున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఈ రవితేజ మాస్ ఛామ్ ఒకెత్తయితే.. ఇక మిల్కీ మరియు రాశి పోటీ పడి మరీ రెచ్చిపోవడం మరో ఎత్తు. అయితే అందాలను ఆరబోయడంలో మిల్కీ తరువాతే ఎవరైనా. ఎందుకంటే అమ్మడు రెచ్చిపోవడం స్టార్టు చేస్తే ఇక కెమెరా సైతం అలసిపోవాల్సిందే. కాకపోతే రాశి ఖన్నా కూడా బాగానే పోటీ ఇచ్చిందిలే. ఇద్దరూ కలసి మాస్ రాజా పక్కన మాంచి స్టెప్పులు వేస్తే రాయే రాయే అనే పాటను రసకందాయంలో పడేశారు.  

« PREV
NEXT »

No comments

Post a Comment