తాజా వార్తలు

Wednesday, 11 November 2015

దున్నపోతుతో ఏటా కోటి ఆదాయం

దున్నపోతు ఏటా కోటి రూపాయలు సంపాదిస్తుంది. ఏంటీ అవాక్కైయ్యారా..ఐతే ఈ వార్త చదవండి. 2007లో పుట్టిన ఈ దున్న ఇప్పటి వరకు ఎన్నో దూడలకు జన్మనిచ్చింది. దీని వీర్యం కోసం యూరోపియన్ దేశాల్లో ఎంతో డిమాండ్. టర్కీ, స్కాట్లాండ్, బ్రెజిల్ వంటి దేశాలకు సైతం దీన్ని ఎగుమతి చేస్తున్నారు. నాలుగు రోజులకు ఒకసారి దీని నుంచి వీర్యాన్ని సేకరిస్తారు. అలా సేకరించిన వీర్యాన్ని నైట్రోజన్ సిలిండర్లలో భద్రపరిచి ఇంజెక్షన్‌ల రూపంలో విక్రయిస్తారు. ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు రూ.400. ఒక్కసారి విడుదలయ్యే వీర్యంపైన రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు వస్తుంది. ఇలా ఏటా కొన్ని వందల ఇంజెక్షన్లను విక్రయిస్తున్నారు. దీనిపైనే ఏటా రూ.కోటి వరకు ఆదాయం లభిస్తోంది! కోటి రూపాయలు సంపాధిస్తున్న ఈ దున్నపోతుకు యువరాజ్  అని పేరు కూడా పెట్టారు. హర్యానా ‘యువరాజ్’కు భారత్‌లోనే కాదు... విదేశాల్లోనూ బాగా ప్రసిద్ధి. ఐతే యువరాజ్ ఇప్పుడు హైదరాబాద్  సదర్ పండుగలో సందడి చేయనన్నది. 
« PREV
NEXT »

No comments

Post a Comment