తాజా వార్తలు

Wednesday, 4 November 2015

అమ్మాయిలతో క్లాస్ లో కూర్చున్నాడని సస్పెండ్

కేరళలోని కోజికోడ్‌లో క్లాస్‌రూమ్‌లో అమ్మాయిలతో కలసి కూర్చున్నందుకు ఓ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్‌ను సస్పెండ్ చేశారు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడంటూ ఆ అబ్బాయిని నెల రోజుల క్రితం కాలేజీ యాజమాన్యం బహిష్కరించింది. క్లాస్‌రూమ్‌లో గర్ల్స్‌తో కలిసి కూర్చున్నందుకు దినూ అనే స్టూడెంట్‌ను సస్పెండ్ చేశారు. మిగతా అమ్మాయిలంతా కాలేజీ మేనేజ్‌మెంట్‌కు క్షమాపణలు చెప్పారు. కానీ దినూ మాత్రం అందుకు నిరాకరించాడు. దీంతో  నిరసనలు భగ్గుమన్నాయి. వివిధ పార్టీ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దాంతో అతన్ని కాలేజీ నుంచి బహిష్కరించారు. కాలేజీ లింగ వివక్ష ప్రదర్శిస్తోందని ఆ స్టూడెంట్ ఆరోపిస్తున్నాడు. కాలేజీలో అమ్మాయిలకు, అబ్బాయిలకు వేర్వేరుగా బెంచ్‌లు ఉన్నాయని స్టూడెంట్స్ ఆరోపించారు. క్యాంటీన్, క్యాంపస్‌లో కూడా ఇదే పరిస్థితి ఉందట. అయితే దీనిపై కాలేజ్ ప్రిన్సిపల్ స్పందించేందుకు నిరాకరించాడు. కాలేజీలో లింగ భేదాన్ని పాటించడం లేదని ఓ ప్రొఫెసర్ తెలిపారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment