తాజా వార్తలు

Wednesday, 4 November 2015

కోర్టు ముందే భార్యను నరికిన భర్త

పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో దారుణం జరిగింది. విడాకుల కేసులో దంపతులు కోర్టుకు వచ్చారు. కోర్టు ఎదుట భార్యను భర్త గొడ్డలితో నరికేశాడు. బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భార్యను నరికిన వెంటనే భర్త సత్యనారాయణ అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు వసుంధర కోడూరు మండలం మట్టపర్రు వాసి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సత్యనారాయణ కోసం గాలిస్తున్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment