తాజా వార్తలు

Saturday, 14 November 2015

హైదరాబాద్ లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ప్రారంభం

హైదరాబాద్ నగరంలోని శిల్పకళావేదికలో 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ వేడుక ప్రారంభ కార్యక్రమానికి కేంద్రమంత్రి రాజ్యవర్ధన్‌సింగ్, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, బాలీవుడ్ నటులు ముఖేష్‌ఖన్నా, కరీనాకపూర్, కరిష్మాకపూర్, టబులతో పాటు ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటి టబు మాట్లాడుతూ.. తన స్థానిక నగరం హైదరాబాద్ పిల్లల చిత్రోత్సవాలకు ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని హీరోయిన్ టబు అన్నారు. ఈ నగరం బాలల చిత్రోత్సవాలకు ఆతిథ్యం ఇవ్వడం నాకు సంతోషంగా ఉంది. బాల్యం ఎంతో విలువైనది. పిల్లలందరికీ శుభాకాంక్షలు. ఉత్సవాల్లో పాల్గొన్న వారందరికి అభినందనలు. పోటీల్లో గెలిచేవారికి ముందుగానే శుభాకాంక్షలని వక్తలు పేర్కొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment