తాజా వార్తలు

Tuesday, 24 November 2015

తమిళనాడులో క్లాస్ రూంలో మందు కొట్టిన విద్యార్థినులు

తమిళనాడులో విద్యార్థినిలు ఏకంగా తరగతి గదిలోనే బీర్ కొట్టి హల్చల్ చేశారు. నమక్కల్ జిల్లాలోని తిరుచెంగోడ్లో గల ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటనకు సంబంధించి 11 తరగతికి చెందిన విద్యార్థినులు పని చేశారు. కూల్ డ్రింక్ బాటిల్స్లో ఎవరికీ అనుమానం బీర్ తెచ్చుకున్నారు ఏడుగురు అమ్మాయిలు. అందులో ముగ్గురు భయపడి తాగలేదు. మిగిలిన వారు తరగతి గదిలోనే తాగారు. మత్తులో జోగుతున్న అమ్మాయిలను గమనించిన క్లాస్ టీచర్ ప్రధానోపాధ్యాయురాలికి ఫిర్యాదు చేయగా చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్. గోపీదాస్ ఆదేశాలతో వీళ్లకు టీసీలు ఇచ్చి ఇంటికి పంపారు. మరోసారి ఇలాంటి ఘటనలకు ఎవరైన పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment