తాజా వార్తలు

Monday, 9 November 2015

బాలీవుడ్‌ టెక్నిషీయన్స్‌తో 'ఫుల్‌ మూన్‌'


గ్లిట్టర్స్‌ ఫిల్మ్‌ అకాడమీ బ్యానర్‌పై గతంలో 'బమ్‌ ధమ్‌' వంటి చిత్రాన్ని రూపొందించిన దీపక్‌ బల్‌దేవ్‌..మరోసారి స్వీయ దర్శకత్వంలో 'ఫుల్‌ మూన్‌' అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రకాష్‌ ఠాకూర్‌ సమర్పణలో తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఈ నెలాఖరునుండి సెట్స్‌పై వెళ్లనుంది. 
ఈ సందర్భంగా చిత్ర దర్శకనిర్మాత దీపక్‌ బల్‌దేవ్‌ మాట్లాడుతూ..''మంచి కథ, కథనంతో 'ఫుల్‌ మూన్‌' అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాము. బ్యాడ్‌ డెసిషన్స్‌ మేక్‌ బెటర్‌ స్టోరీస్‌ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. మ్యూజిక్‌కి మంచి స్కోప్‌ ఉన్న ఈ చిత్రానికి బాలీవుడ్‌ సంగీత దర్శకుడు అభిలాష్‌ సంగీతాన్ని అందించనున్నారు. ప్రస్తుతం సాంగ్స్‌ రికార్డింగ్‌ పూర్తయింది. చక్‌దే ఇండియా, ఏమాయ చేసావే, రావణ్‌, ఓం శాంతి ఓం వంటి చిత్రాలకు కొరియోగ్రఫీ అందించిన సాగర్‌దాస్‌ ఈ చిత్రానికి కొరియోగ్రఫీ అందిస్తున్నారు. మూడు జంటల కథతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కెనడాకి చెందిన షీక అనే అమ్మాయి ఓ నటిగా చేస్తుంది. ఈ చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెలాఖరునుండి డెహ్రడూన్‌, సిమ్లా, కసోల్‌లలో జరగనుంది...'' అని అన్నారు. 
ఈ చిత్రానికి సంగీతం: అభిలాష్‌, కొరియోగ్రఫీ: సాగర్‌దాస్‌, మేకప్‌ఛీప్‌: నాగేశ్వరరావు, అసోసియేట్‌ డైరెక్టర్‌: జహంగీర్‌; కో-డైరెక్టర్‌: హేమంత్‌ పువ్వాడ, స్టైలిస్ట్‌: అతిధి దత్తా, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: తుమ్మల భిక్షపతి, నిర్మాణం: గ్లిట్టర్స్‌ ఫిల్మ్‌ అకాడమీ, సమర్పణ: ప్రకాష్‌ ఠాకూర్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్శం: దీపక్‌ బల్‌దేవ్‌. 
« PREV
NEXT »

No comments

Post a Comment