తాజా వార్తలు

Sunday, 15 November 2015

మీడియా ముందుకు గంగిరెడ్డి

స్మగ్లర్  గంగిరెడ్డిని మారిషస్ నుంచి భారత్ తీసుకువచ్చిన అనంతరం అతన్ని మీడియా ముందు హాజరుపరిచారు. అనంతరం డీజీపీ మీడియాకు వివరాలు వెల్లడించారు. గంగిరెడ్డిని భారత్‌కు తరలించేందుకు సహకరించిన మారిషస్ అధికారులకు డీజీపీ ధన్యవాదాలు తెలిపారు. స్మగ్లర్ గంగిరెడ్డి ఆస్తులు జప్తు చేస్తామన్నారు ఆంధ‌్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు. గంగిరెడ్డి సహకారంతో మిగిలిన స్మగ్లర్లను కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. 2014లో గంగిరెడ్డి పేరు బయటకు వచ్చిందని అప్పట్లో హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నట్టు తెలిపారు. తప్పుడు పాస్‌పోర్ట్‌ సంపాదించి దుబాయ్‌, మలేషియా, సింగపూర్ తదితర దేశాలకు వెళ్లాడన్నారు. పోలీసులు పాస్‌పోర్ట్ క్యాన్సిల్ చేయించడంతో విమానాశ్రయాల్లో తప్పుడు చిరునామాలు ఇచ్చి తప్పించుకునేవాడన్నారు. ఇతనిపై ప్రొద్దుటూరు కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో తొలుత అక్కడ హాజరు పరుస్తామని డీజీపీ తెలిపారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment