తాజా వార్తలు

Tuesday, 10 November 2015

ఏపీలో జోరువాన

వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు చిత్తూరు జిల్లాలో జనజీవనం అతలాకుతలమైంది. ఉత్తరాంధ్రలోనూ కొన్ని చోట్ల వానలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 50-55 కిలోమీటర్ల వేగంతో, ఉత్తర కోస్తా వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్ల వద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  పదిహేనేళ్ల తర్వాత స్వర్ణముఖి నదికి జలకళ వచ్చింది. తమిళనాడులోని వేలూరుకు దక్షిణ ఆగ్నేయదిశలో 60 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం పశ్చిమదిశగా పయనిస్తూ క్రమంగా బలహీనపడుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

« PREV
NEXT »

No comments

Post a Comment