Writen by
vaartha visheshalu
05:05
-
0
Comments
హైదరాబాద్ లో ముగ్గురు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసినట్టు పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ప్రకటించారు. పాతబస్తీకి చెందిన హబీబ్ అబ్బాస్, హబీబ్ హసన్, ఇమ్రాన్ ఉస్మాన్ షేక్ లను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. నిందితులపై 200లకుపైగా కేసులు ఉన్నాయని సీపీ వెల్లడించారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో సావిత్రి అనే మహిళ చనిపోయిన కేసులో కూడా ఈ ముగ్గురు నిందితులుగా ఉన్నారని చెప్పారు. ముగ్గురు నిందితులపై పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేస్తున్నట్టు సీపీ మహేందర్ రెడ్డి వివరించారు.
No comments
Post a Comment