తాజా వార్తలు

Friday, 27 November 2015

బాహుబలి నిరాశ కలిగించింది : సెంథిల్

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి' మూవీ ఇండియా వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమా చరిత్రలోనే బెస్ట్ గ్రాఫిక్స్ అందించిన సినిమా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమాను తన కెమెరాలో అద్భుతంగా బంధించిన ఘనత డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సెంథిల్ కుమార్ కే దక్కుతుంది. అయితే బాహుబలి సినిమా చూసిన ప్రేక్షకులు విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో అద్భుతం అని పొగిడినప్పటికీ.... కొన్ని సీన్లలో రియాల్టీ లోపించిందని విమర్శించారు. సెంథిల్ కుమార్ కూడా ఇదే విసయం నొక్కివక్కానించారు.‘బాహుబలి' సినిమాలోని చాలా విషయాల్లో తాను సంతృప్తితో లేనని అంటున్నారు. ఇటీవల ఆయన నేషనల్ మీడియాతో మాట్లాడుతూ...‘డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా.... బాహుబలి సినిమాలోని చాలా విషయాల్లో డిసప్పాయింట్ అయ్యాను. విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించి చాలా సీన్లలో మిస్టేక్స్ జరిగాయి. వాటి వల్ల గ్రాఫిక్స్‌కి ఫేక్ లుక్ వచ్చింది అన్నారు. బాహుబలి 2 విషయంలో ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ కాకుడండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని సెంథిల్ కుమార్ తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment