తాజా వార్తలు

Sunday, 15 November 2015

జగన్ వరంగల్ ఉప ఎన్నిక ప్రచారం షెడ్యూల్

వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి నుంచి వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంతో బిజీబిజీగా గడపనున్నారు. సోమవారం ఉదయం 8గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి జనగామ మీదుగా పాలకుర్తి  చేరుకుంటారు. పాలకుర్తి, జఫర్ గఢ్, వర్ధన్న పేట, రాయపర్తి, తొర్రూరు, హన్మకొండ ల మీదుగా.. 101 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించ నున్నారు. సోమవారం సాయంత్రం తొర్రూరు లో బహిరంగ సభలో పాల్గొంటారు.
రెండో రోజు పర్యటనలో భాగంగా  హన్మకొండ, ఆత్మకూరు, శాయంపేట, రేగొండ, భూపాలపల్లి, పరకాల, హన్మకొండ ల్లో రోడ్ షో నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం పరకాల లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
బుధవారం హన్మకొండతో పాటు, సంగెం, గీసుకొండ ప్రాంతాల్లో ప్రచారం మీద దృష్టి పెడతారు. గురువారం హన్మకొండ నుంచి నయీం నగర్, కేయూ క్రాస్ రోడ్, కాజీపేట, మడికొండ, ధర్మసాగర్, స్టేషన్ ఘన్ పూర్, రఘునాథ్ పల్లి లలో ప్రచారం నిర్వహిస్తారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment