తాజా వార్తలు

Monday, 23 November 2015

వరద బాధితులను ఓదార్చిన జగన్

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇవాళ ఉదయం చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న జననేత... అక్కడి నుంచి రోడ్డు మార్గాన వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరుకు చేరుకున్నారు. పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి, ఆస్తులు నష్టపోయిన వారిని వైఎస్ జగన్పరామర్శించారు. కుక్కల దొడ్డి గ్రామంలో రైతులతో మాట్లాడారు.  దెబ్బతిన్న పంటలను పరిశీలించి బాధితులను ఓదార్చారు. ప్రభుత్వ పరంగా పరిహారం అందేలా చూస్తాన్నారు. వైఎస్ జగన్ వెంట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఉన్నారు.ప్రభుత్వ పరంగా పరిహారం అందేలా చూస్తాన్నారు. వైఎస్ జగన్ వెంట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఉన్నారుకాగా వైఎస్ జగన్ శెట్టిగుంట రైల్వేస్టేషన్ సమీపంలోని కాలనీలో ఇటీవల గోడకూలి మృతి చెందిన బాలుడు హర్షవర్దన్(4) తల్లిదండ్రులు తిరుమల, కృష్ణవేణి దంపతులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. మధ్యాహ్నం ఎస్.కొత్తపల్లి గ్రామంలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించి, బాధిత రైతుల నుంచి వివరాలు తెలుసుకుంటారు.
« PREV
NEXT »

No comments

Post a Comment