తాజా వార్తలు

Monday, 2 November 2015

నవంబర్‌ 6న తెలుగులో జజ్బా విడుదల

ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో జీ స్టూడియోస్‌, వైట్‌ ఫెదర్‌ ఫిలింస్‌, వైకింగ్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్స్‌పై సంజయ్‌గుప్తా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిందీ చిత్రం 'జజ్బా'. ఈ చిత్రం అక్టోబర్‌ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌తో భారీ కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రంలో అడ్వకేట్‌ అనురాధవర్మగా ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆద్యంతం సస్పెన్స్‌తో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రంలో చక్కని సెంటిమెంట్‌ కూడా వుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సంబంధించి ఈ చిత్రం తెలుగు, హిందీ విడుదల హక్కులను ఆరెంజ్‌ మీడియా సొంతం చేసుకుంది. అక్టోబర్‌ 9న రెండు తెలుగు రాష్రాల్లో హిందీ వెర్షన్‌ విడుదలై ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ 'అడ్వకేట్‌ అనురాధవర్మ'గా నవంబర్‌ 6న విడుదల చేస్తున్నారు ఆరెంజ్‌ మీడియా అధినేతలు నివాస్‌వర్మ, సతీష్‌. 
ఈ సందర్భంగా ఆరెంజ్‌ మీడియా అధినేతలు నివాస్‌వర్మ, సతీష్‌ మాట్లాడుతూ - ''ఓటమి అంటే ఏమిటో ఎరుగని అడ్వకేట్‌ అనురాధవర్మకు ఒక అనూహ్యమైన సంఘటన ఎదురవుతుంది. తన కూతురిని కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ చేస్తారు. పాపను కిడ్నాప్‌ చేసింది డబ్బు కోసం కాదని అనురాధవర్మకు తెలుస్తుంది. ఒక అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసిన నేరస్తుడి కేసును వాదిస్తున్న అనురాధవర్మ ఆ కేసు ఓడిపోవాలని, ఆ నేరస్తుడ్ని బయటికి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తారు కిడ్నాపర్స్‌. తన పాప కోసం అనురాధవర్మ ఆ క్రిమినల్‌ని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చిందా? దాని తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయి అనేది మిగతా కథ. ఈ కథ ఆద్యంతం ఎంతో ఉత్కంఠత కలిగించేలా తెరకెక్కించారు దర్శకులు సంజయ్‌గుప్తా. హాలీవుడ్‌ రేంజ్‌ టేకింగ్‌, అద్భుతమైన ఫోటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్స్‌గా చెప్పొచ్చు. అడ్వకేట్‌ అనురాధవర్మగా ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఈ చిత్రానికి పెద్ద హైలైట్‌గా నిలుస్తుంది. జురాసిక్‌ వరల్డ్‌, లైఫ్‌ ఆఫ్‌ పై చిత్రాల్లో అద్భుతమైన నటనను ప్రదర్శించిన ఇర్ఫాన్‌ఖాన్‌ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. వీరితోపాటు షబానా ఆజ్మీ, జాకీష్రాఫ్‌, అతుల్‌ కులకర్ణి, అభిమన్యు సింగ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఇటీవల వచ్చిన 'దాగుడుమూత దండాకోర్‌' చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన బేబీ సారా అర్జున్‌ ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్‌ కూతురిగా నటించింది. ఇంత మంచి చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాత సంజయ్‌గుప్తాగారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత నెల హిందీ వెర్షన్‌ని మన రాష్ట్రాల్లో విడుదల చేశాం. చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి 'అడ్వకేట్‌ అనురాధవర్మ'గా నవంబర్‌ 6న 130 థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్ర కథాంశంగానీ, టేకింగ్‌గానీ, సస్పెన్స్‌తో కూడిన థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌గానీ తప్పకుండా నచ్చుతాయి. తెలుగులో కూడా ఈ చిత్రం తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం మాకు వుంది'' అన్నారు. 
ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌, షబానా ఆజ్మీ, జాకీష్రాఫ్‌, అతుల్‌ కులకర్ణి, అభిమన్యు సింగ్‌, ప్రియా బెనర్జీ, సారా అర్జున్‌, సిద్ధాంత్‌ కపూర్‌, చందన్‌రాయ్‌ సన్యాల్‌ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించారు. 
ఈ చిత్రానికి సంగీతం: అంజాద్‌-నదీమ్‌, ఆర్కోప్రావో ముఖర్జీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: అమర్‌ మొహిలే, సినిమాటోగ్రఫీ: సమీర్‌ ఆర్య, ఎడిటింగ్‌: సునీల్‌ నాయక్‌, నిర్మాతలు: సంజయ్‌గుప్తా, అనురాధగుప్తా, నితిన్‌ కెని, ఆకాష్‌ చావ్లా, సచిన్‌ ఆర్‌.జోషి, రైనా సచిన్‌ ఆర్‌.జోషి, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంజయ్‌గుప్తా. 
« PREV
NEXT »

No comments

Post a Comment