తాజా వార్తలు

Friday, 27 November 2015

అమీర్ ఖాన్ కు జైపాల్ రెడ్డి మద్దతు

కేంద్రమాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఆంగ్ల, తెలుగు భాషలలో మంచి ప్రావీణ్యం ఉంది. ఆయన ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ కు మద్దతు ఇచ్చే అంశంలో కూడా తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.అమీర్ ఖాన్ తన ప్రకటనపై వివరణ ఇవ్వనవసరం లేదని అబిప్రాయపడ్డారు.అమీర్ ఖాన్ అనేక సినిమాలలో దేశభక్తుడి పాత్రలను పోషించారని ,నిర్మాణాత్మక పాత్రలలో అబినయించారని జైపాల్ రెడ్డి అన్నారు.అమీర్ ఖాన్ పై కొందరు చేసిన వ్యాఖ్యలు షాకింగ్ కలిగించేవి అయినా తనకు ఆశ్చర్యం కలిగించలేదని ఆయన అన్నారు.వారి వ్యాఖ్యలు బిజెపి,సంఘ్ పరివార్ ఫనటిక్ సంస్కృతిలో భాగమేనని ఆయన విమర్శించారు.దేశంలో ఉన్న అసహన సంస్కృతిపై అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు నిజాయితీగా తన నిస్ప్రహను వ్యక్తం చేశారని జైపాల్ రెడ్డి సమర్దించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment