తాజా వార్తలు

Monday, 16 November 2015

అంధుడికి సీఎం కేసీఆర్ చేయూత

వరంగల్ జిల్లా తొర్రూర్ కు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్ధి గండి రాకేశ్ జీవితకాల వాంఛ నెరవేరింది. నోటమాట రాని గండి రాకేశ్ కు కొద్ది కాలంగా కంటి చూపు కూడా మందగించింది. చాలాకాలంగా రాకేశ్ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రసంగాలను, పత్రికల్లో వచ్చిన వార్తలను, ఫొటోలను ఫాలో ఆవుతున్నాడు. వాటన్నిటినీ జాగ్రత్తగా భద్రపరుచుకుంటున్నాడు. కేసీఆర్ బొమ్మలను కూడా వేస్తున్నాడు. తన కంటి చూపు పూర్తిగా పోయేలోపు కేసీఆర్ ను చూడాలన్నది ఆయన కల. ఈ విషయాన్ని తొర్రూర్ కు చెందిన స్థానికులు మంత్రి జగదీశ్ రెడ్డికి చెప్పారు. దీంతో జగదీశ్ రెడ్డి రాకేశ్ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆదివారం రాకేశ్ ను ముఖ్యమంత్రి ఇంటికి ఆహ్వానించారు. దీంతో రాకేశ్ ఆదివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. తాను గీసిన బొమ్మలను బహూకరించాడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాకేశ్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. మెరుగైన వైద్యం చేయిస్తామని హామీ ఇచ్చారు. రాకేశ్ భవిష్యత్ కు కావలసిన ఏర్పాట్లు కూడా చూస్తామని చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment