తాజా వార్తలు

Sunday, 15 November 2015

కొడాలి నాని అరెస్ట్

వైఎస్సార్ సీపీ కార్యాలయానికి సంబంధించిన భూ వివాదంలో ఎమ్మెల్యే కొడాలి నానిని పోలీసులు ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.  దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పార్టీ కార్యాలయం నిర్వహిస్తున్న అద్దె భవనానికి ఇటీవల యజమాని తాళం వేయడంతో దాన్ని తొలగించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించడంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు నానిని అదుపులోకి తీసుకున్నారు. నాటకీయ పరిణామాల మధ్య ఆయనను కైకలూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పార్టీ కార్యాలయం వద్ద 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కొడాలి నాని అరెస్ట్ తో పార్టీ కార్యాలయానికి భారీగా పార్టీ కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు. గుడివాడలో జరిగిన తాజా పరిణామాలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొడాలి నానితో ఫోన్ లో మాట్లాడారు.
« PREV
NEXT »

No comments

Post a Comment