తాజా వార్తలు

Saturday, 28 November 2015

ఆర్య సినిమాను గుర్తు చేసుకున్న దిల్ రాజు

‘పన్నెండేళ్ల క్రితం ‘ఆర్య’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఇలాగే ఈ సుదర్శన్ థియేటర్‌లో జరుపుకున్నాం. ఆ సినిమాకు పనిచేసిన వాళ్లంతా ప్రస్తుతం స్టార్స్‌గా ఎదిగిపోయారు. సుకుమార్ మంచి రైటర్.‘కుమారి 21 ఎఫ్’లో నేటి యువత మనోభావాల్ని చక్కగా ఆవిష్కరించారు. ఇది ప్రతి తలిదండ్రులు చూడాల్సిన సినిమా. కంటెంట్ బాగుంది కాబట్టి అందరూ అంగీకరించాలి తప్పదు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులు ‘కుమారి 21ఎఫ్’ను ఆదరిస్తున్నారు’ అన్నారు దిల్‌రాజు. సుకుమార్  సమర్పణలో రూపొందిన చిత్రం ‘కుమారి 21ఎఫ్’. రాజ్‌తరుణ్, హేభా పటేల్ జంటగా నటించారు. సూర్యప్రతాప్ పల్నాటి దర్శకుడు. విజయ్‌కుమార్ బండ్రెడ్డి, థామస్‌రెడ్ది సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సక్సెస్‌మీట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దిల్ రాజు పై విధంగా స్పందించాడు. సుకుమార్ మాట్లాడుతూ ‘నా సినిమాలపై దిల్‌రాజుకు గట్టి నమ్మకం. ‘కుమారి21’తో కలిపి నాకు సంబంధించిన నాలుగు చిత్రాల్ని ఆయన పంపిణీ చేశారు. నేను నిర్మాతగా రూపొందిన ‘కుమారి 21ఎఫ్’ను కూడా దిల్‌రాజు పంపిణీ చేశాడు. ఇక ఇండియాలో మ్యూజిక్ షోస్‌లో స్టెప్స్‌వేసి రాక్ చేసే ఏకైక సంగీత దర్శకుడు ఎవరైనా వున్నారంటే అతను దేవిశ్రీప్రసాద్ మాత్రమే. దేవి సంగీతం, రత్నవేలు ఫోటోగ్రఫీ, సూర్యప్రతాప్  ఈ చిత్ర విజయానికి దోహదపడ్డాయి. దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ‘సుకుమార్ నమ్మకమే ఈ సినిమా. రత్నవేలు ఫోటోగ్రఫీ ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్‌గా నిలిచింది. ఈ సినిమాకు దిల్‌రాజు తోడవ్వడంతో మరింత బలం పెరిగింది. సూర్యప్రతాప్ చాలా చక్కగా తెరకెక్కించాడు. ఇంత మంది కలిసి చేసిన ఈ సినిమా సక్సెస్ కావడం నేను మర్చిపోలేని రోజు ఇది’ అన్నారు. ‘ఈ సినిమాతో నన్ను దర్శకుడిగా నిలబెట్టిన సుకుమార్‌కు జన్మజన్మలు రుణపడి వుంటాను’ అని పల్నాటి సూర్యప్రతాప్ తెలిపారు’ ఈ వేడుకలో రాజ్ తరుణ్, రత్నవేలు, విజయ్‌కుమార్ బండ్రెడ్డి, థామస్‌రెడ్డి, హేభా పటేల్, హేమ, కమల్,భాను, నోయెల్, సకుమార్ గురువు డా. రామ్మోహన్‌రెడ్డి, సహనిర్మాత రవి, గిరి, సాయి సుధీర్, శేషు కుమార్ తదితరులు పాల్గొన్నారు.  
  దేవిశ్రీప్రసాద్ హీరోగా దిల్‌రాజు చిత్రం!
సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న దేవిశ్రీప్రసాద్‌ను హీరోగా పరిచయం చేయాలని చాలా రోజులుగా దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ అవకాశాన్ని నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ‘కుమారి 21 ఎఫ్’ చిత్ర సక్సెమీట్‌లో దేవిశ్రీప్రసాద్‌ను హీరోగా పరిచయం చేస్తున్నానని ప్రకటించాడు ‘దిల్’రాజు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ‘దేవిశ్రీప్రసాద్‌కు ప్రేక్షకుల్లో ఎంత క్రేజుందో అందరికి తెలిసిందే. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ‘నేను నటించ దగ్గ కథ కుదిరితే హీరోగా నటిస్తానని’ దేవి చెప్పాడు. అందుకే అతన్ని మా సంస్థ ద్వారా హీరోగా పరిచయం చేయబోతున్నాను. 12 ఏళ్ల క్రితం ‘ఆర్య’తో ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్‌ని అందించిన అదే టీమ్‌తో ఈ సినిమా చేయబోతున్నాను. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తారు’ అని తెలిపారు. అనంతరం దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ‘నిర్మాతల్లో శిఖరం లాంటి వ్యక్తి దిల్ రాజు, దర్శకుల్లో శిఖరం సుకుమార్, కెమెరామెన్‌లలో శిఖరం రత్నవేలు ఈ ముగ్గురు నన్ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా చేస్తామని చెప్పడం ఆనందంగా వుంది’ అన్నారు.       
« PREV
NEXT »

No comments

Post a Comment