తాజా వార్తలు

Friday, 13 November 2015

ప్రభాస్ కు అప్పుడే పెళ్లా..!

ప్రభాస్  ఇంటి వాడు కాబోతున్నాడంటూ వచ్చిన వార్తలను కృష్ణంరాజు కొట్టిపారేశారు.  ఈ వార్తలపై కృష్ణంరాజు స్పందిస్తూ.. ప్రభాస్ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడని..కాబోయే భార్యను సెలెక్ట్ చేసుకున్నాడని వస్తున్న వార్తలు నిజం కావన్నరు. ప్రభాస్ కు పిల్లను చూస్తే డేట్ ఖరారు చేసుకుని నేనే ముందు ఈ విషయాన్ని మీడియాకు చెప్తానని’ వెల్లడించారు. బాహుబలి సినిమా విజయోత్సాహంలో ఉన్న ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి-2 ప్రాజెక్టుతో బిజీబిజీగా ఉన్నాడని రెబల్ స్టార్ చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment