తాజా వార్తలు

Monday, 23 November 2015

'మిత్రవింద' సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ..!


సాయి కృప, రామకృష్ణ, వంశీ ప్రధాన పాత్రల్లో అమృత సాయి ఆర్ట్స్ బ్యానర్ పై సాయిరాం దాసరి దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం 'మిత్రవింద'. ఈ చిత్రం పోస్టర్ ను, ట్రైలర్ ను సోమవారం సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ హైదరాబాద్ లో విడుదల చేసారు. ఈ సందర్భంగా..ఎం.ఎం.శ్రీలేఖ మాట్లాడుతూ.. ''ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ మధ్య ఇలాంటి చిత్రాలకు మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. 'మిత్రవింద' టైటిల్ చాలా బావుంది. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. టీం అందరికి ఆల్ ది బెస్ట్''.. అని చెప్పారు.
సాయిరాం దాసరి మాట్లాడుతూ.. ''నేను మొదట డైరెక్ట్ చేసిన 'లాటరీ' చిత్రానికి నేషనల్ అవార్డు లభించింది. తరువాత 'అమ్మ' అనే ఆల్బం చేసాను. ఇది నా మూడవ ప్రాజెక్ట్. మొట్టమొదటి సారిగా ఇండియన్ సినిమాలో ఎస్.బి.రే టెక్నాలజీను ఉపయోగించిన చిత్రమిది. ఈ సినిమా ఒక్క రోజులో జరిగే కథాంశం గా రూపొందించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం''... అని చెప్పారు.ఓలేటి రామకృష్ణ మాట్లాడుతూ.. ''ప్రొడక్షన్ మేనేజర్ గా ఎన్నో సంవత్సరాలు నుండి అన్నపూర్ణ స్టూడియోస్ లో పని చేస్తున్నాను. చిన్న బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని చేయాలని భావిస్తున్నాం'' అని చెప్పారు.
వంశీ మాట్లాడుతూ.. ''ఇది నా మొదటి సినిమా. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు ఇది. నాకు మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలు థాంక్స్'' అని చెప్పారు.
ఈ చిత్రానికి ఎడిటర్: కిరణ్ రెడ్డి, కెమెరామెన్: దారా రవి, కో-ప్రొడ్యూసర్: ఓలేటి రామకృష్ణ, దర్శకనిర్మాత: సాయిరాం దాసరి.
« PREV
NEXT »

No comments

Post a Comment