తాజా వార్తలు

Friday, 13 November 2015

ఐఎస్ ఐఎస్ మారణకాండ

 ప్రపంచాన్ని వణికిస్తోన్న ఐసీస్... ఫ్రాన్స్‌పై పంజా విసిరింది. పారిస్‌లో దాడులకు దిగిన ఉగ్రవాదులు ఏకే47 గన్నులతో అల్లకల్లోలం సృష్టించారు. ఒకవైపు పారిస్ ప్రజలు ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తున్న సమయంలో...ఉగ్రవాదులు ఆకస్మికంగా దాడులకు దిగారు. ప్రపంచ ఛాంపియన్ జర్మనీతో ఫ్రాన్స్ ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంపై ఉగ్రవాదులు ఏకే-47 గన్నులతో బీభత్సం సృష్టించారు. కొందరు ఉగ్రవాదులు ఏకే-47 గన్నులతో రాగా, కొందరు తమ శరీరాలకు బాంబులు కట్టుకుని దాడులకు దిగారు. సాకర్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఉగ్రవాదులు మహా బీభత్సం సృష్టించారు. ఓ థియేటర్‌ను అదుపులోకి తీసుకున్న ఐసీస్ ఉగ్రవాదులు...వందమందిని చంపేశారు. సత్తా చాటుకునేందుకే ఫ్రాన్స్‌లో దాడికి పాల్పడిందా ? లేదంటే ఐసీస్ చీఫ్ అబూ బకర్‌ మృతికి సమాధానం చెప్పేందుకా ? అమెరికా సైనికుల దాడులను తిప్పికొట్టేందుకు ఈ వ్యూహం పన్నిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

« PREV
NEXT »

No comments

Post a Comment