తాజా వార్తలు

Wednesday, 11 November 2015

వరంగల్ ఉప ఎన్నికల్లో రోజా ప్రచారం

వరంగల్ నియోజక వర్గంలోని రఘనాథపల్లి, స్టేషన్ ఘన్‌పూర్, జాఫర్‌గడ్, వర్ధన్నపేటలో ఎమ్మెల్యే రోజా ప్రచారం నిర్వహిస్తున్నారు. రఘనాథపల్లి, స్టేషన్ ఘన్‌పూర్, జాఫర్‌గడ్, వర్ధన్నపేట రోడ్‌షోలలో పార్టీ తరపున ప్రచారం చేశారు. రాజధాని పేరుతో దోచుకున్న డబ్బుతో వరంగల్‌లో ఓట్లు కొనాలని చంద్రబాబు చూస్తున్నాడని అన్నారు. అవినీతి లో కూరుకొని పోయిన నాయకుడు చంద్రబాబు అని ఆమె అన్నారు.దివంగత మహా నేత వైఎస్సార్ ఆశయాలు నెరవేరాలంటే వరంగల్ లోక్ సభ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లా సూర్య ప్రకాశ్ ను గెలిపించాలని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే రోజా పిలుపు ఇచ్చారు. వైఎస్సార్సీపీ గుర్తు ఫ్యాన్ కు ఓటు వేయాలని ఆమె అన్నారు.  మాటల మాంత్రికుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటు ఉంటే ఓటు వస్తుందని భావిస్తున్నాడని విమర్శించారు. ఈ ఉప ఎన్నికలు ప్రజలు కోరున్న ఎన్నికలు కావన్నారు. కొందరి స్వార్థం వల్ల వచ్చిన ఎన్నికలు అని పరోక్షంగా టీఆర్ ఎస్ కు చురకలు అంటించారు.  ప్రజల సమస్యలు పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధివచ్చేలా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌ను గెలిపించాలని అమె అన్నారు. ఈ రోడ్‌షోలో రోజాతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో పాటు రాష్ర్ట, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment