తాజా వార్తలు

Monday, 30 November 2015

పౌరసత్వ వివాదం నుంచి బయటపడ్డ రాహూల్

రాహూల్ గాంధీ పౌరసత్వ వివాదం నుంచి బయటపడ్డరు. బ్రిటన్‌ లోని కంపెనీలా అధికారుల ముందు తాను ఆ దేశ పౌరుడిగా రాహుల్‌ గాంధీ పేర్కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో, ఈ అంశంపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్‌ ఈ పిల్‌ ను కొట్టివేసింది. రాహుల్ పౌరసత్వంపై జతచేసిన డాక్యుమెంట్‌ ప్రామాణికతను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇది అల్పమైన పిటిషన్‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి సైతం రాహుల్ బ్రిటన్‌ పౌరుడని ఆరోపణలు చేశారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment