తాజా వార్తలు

Saturday, 28 November 2015

రేణుకాచౌదరి భూముల్లో ఎర్రజెండాలు

ఖమ్మం జిల్లాలో పరిశ్రమ పెడతానని చెప్పి పార్లమెంటు సభ్యురాలు రేణుకా చౌదరి గతంలో ప్రభుత్వం నుంచి భూములు తీసుకుని ,పరిశ్రమ పెట్టకుండా మామిడి తోట వేశారని సిపిఎం ఆరోపించింది.పాల్వంచ సమీపంలో 43 ఎకరాల భూమిని రేణుకా చౌదరి తీసుకున్నారని, ఆక్సికో అనే కంపెనీ ప్రారంబించి ఉపాది అవకాశాలు కల్పిస్తామని చెప్పారని సిపిఎం నేతలు ఆరోపించారు. కాని అలా చేయకుండా తోట వేశారన్నది వారి అబియోగం గా ఉంది. సిపిఎం నేత కాసాని ఐలయ్య ఆద్వర్యంలో ఆ బూములలో ఎర్రజెండాలు నాటారు. చెరువు బంజర్ తదితర చోట్ల కూడా చెరువులలో ఖాళీ భూములలో కూడా జెండాలు పాతారు పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అడ్డుకున్నారు.పరిశ్రమ పెడతానని చెప్పి ప్రభుత్వ భూమి తీసుకున్న తర్వాత అలా చేయకపోతే ఎలా!
« PREV
NEXT »

No comments

Post a Comment