తాజా వార్తలు

Sunday, 15 November 2015

చైనా ఓపెన్ లో సైనా ఓటమి

చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టైటిల్  సాధనలో సైనా నెహ్వాల్ మరోసారి నిరాశే ఎదురైంది. ఫైనల్లో సైనా 12-21, 15-21 తేఢాతో ప్రపంచ ఏడో ర్యాంకర్ లీ జురుయ్(చైనా)చేతిలో ఓటమి పాలై రన్నరప్ గా నిలిచింది. తొలి సెట్ ఆదిలో సైనా 4-1 తో ఆధిక్యం దిశగా కొనసాగినా.. ఆ తరువాత అనూహ్యం వెనుకబడి పరాజయం చెందింది. తొలి గేమ్ లో సైనా అనవసర తప్పిదాలు చేయడంతో లీ జురుయ్ 14-9తో ముందంజ వేసింది.  ఇదే ఊపును కడవరకూ కొనసాగించిన లీ జురుయ్ తొలి సెట్ ను కైవసం చేసుకుంది. కాగా, రెండో సెట్ లో సైనా పోరాడి ఓడింది. రెండో గేమ్ లో సైనా 9-5, 11-6 తో ఆధిక్యంలోకి వెళ్లినా లీ జురుయ్ తిరిగి పుంజుకుంది.  వరుసగా  బ్రేక్ పాయింట్లను సాధిస్తూ  సైనాను వెనక్కు నెట్టింది.  ఈ క్రమంలో రెండో సెట్ ను లీ జురుయ్ 21-15 తేడాతో సాధించి చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను ఎగురేసుకుపోయింది.  
« PREV
NEXT »

No comments

Post a Comment