తాజా వార్తలు

Sunday, 1 November 2015

డబ్ల్యూటీఏ టూర్ ఫైనల్స్ ట్రోఫీ సాధించిన సానియా జోడి

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా డబ్ల్యూటీఏ టూర్‌లో దుమ్ము రేపింది. మహిళల సింగిల్స్ ప్రపంచ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ తో కలిసి డబ్ల్యూటీఏ టూర్ ఫైనల్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో సానియా జోడీ 6-0, 6-3 తేడాతో 8వ సీడ్ ముగురుజ్జా-సూరేజ్ సవరో (స్పెయిన్) జంటపై విజయం సాధించింది. దీంతో ఈ జోడీ సాధించిన టైటిల్స్ సంఖ్య 9కి చేరింది. వీరి ఖాతాలో వరుసగా 22వ విజయం వచ్చి చేరింది. సానియా మీర్జాకు తన కెరీర్‌లో ఇది 32వ డబుల్స్ టైటిల్. హింగిస్‌కు 50వ డబుల్స్ టైటిల్. డబ్ల్యూటీఏ టోర్నీ మహిళల డబుల్స్ గెలిచిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఒకే ఏడాదిలో 9 టైటిల్స్ సాధించడం అసాధారణమైన అంశమని.. ఇలాంటి మరెన్నో విజయాలను సానియా సాధించాలని సీఎం ఆకాంక్షించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment