తాజా వార్తలు

Monday, 23 November 2015

తమాషా కోసమట... తమాషా ప్రమోషన్

‘తమాషా’ సినిమా ప్రచారం కోసం  రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనే అష్టకష్టాలు పడుతున్నరు. ఇద్దరు కలిసి వెరైటీగా  ట్రైన్‌లో సినిమా ప్రమోషన్ చేశారు. ఈ మాజీ లవర్స్ నటించిన తాజా చిత్రం ‘తమాషా’ సినిమా కోసం తమాషాగా ప్రచారాలను నిర్వహిస్తున్నారు. తమషా చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. మొదట ఈ మూవీ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా.. చిత్రబృందం ఢిల్లీ వెళ్లాలనుకున్నారు. ఫ్లయిట్ టికెట్స్ బుక్ అయిపోవటంతో.. ఇలా వెరైటీగా ట్రైన్లో ఎక్కి ప్రచారాలని నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారాన్ని దీపికా.. అండ్ ది జర్నీ బిగిన్స్ అని ట్వీట్ చేసింది. ప్రమోషన్ లో మస్త్ ఎంజాయ్ చేస్తున్నామని చెప్పుకొస్తున్నరు.
« PREV
NEXT »

No comments

Post a Comment