తాజా వార్తలు

Tuesday, 17 November 2015

'తను నేను` 27న విడుద‌ల‌

అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న రామ్మోహన్‌ పి. ఇప్పుడు దర్శకుడుగా మారారు. అవికా గోర్‌ హీరోయిన్‌గా, 'వర్షం' దర్శకుడు శోభన్‌ తనయుడు సంతోష్‌ శోభన్‌ హీరోగా డి.సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్‌ సినిమా, వయాకామ్‌ 18 పిక్చర్స్‌ పతాకాలపై స్వీయ దర్శకత్వంలో రామ్మోహన్‌ పి. నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'తను నేను' షూటింగ్‌ పూర్తయింది.  దీపావళి కానుకగా రిలీజైన టీజ‌ర్‌కి చ‌క్క‌ని స్పంద‌న వచ్చింది. ఈనెల 27న సినిమా రిలీజ‌వుతోంది.  

చిత్ర దర్శకుడు, నిర్మాత‌ పి.రామ్మోహన్‌ మాట్లాడుతూ -''అష్టాచెమ్మా చిత్రంతో విజయం అందుకుని ఏడేళ్లయ్యింది. చాలా కాలం పాటు నాయుడుగారితో, సురేష్‌ ప్రొడక్షన్‌తో పనిచేసిన అనుబంధం ఉంది. ఈ బ్యానర్‌లోనే నేను డైరెక్ట్‌ చేయడం అన్నది ఓ కల లాంటిది. 1996లో పరిశ్రమకి వచ్చాను. అప్పట్నుంచి సురేష్‌బాబుతో స్నేహం ఉంది. రామానాయుడు ఫిలింస్కూల్‌ విద్యార్థి సాయేష్‌ అనే కుర్రాడు ఈ కథ రాసుకున్నాడు. అమెరికా వెళ్లిపోతూ .. కథ ఇచ్చేస్తాను అని ఇచ్చేసి వెళ్లిపోతుంటే .. తనని తిట్టి ఈ కథను నువ్వే డైరెక్ట్‌ చెయ్‌ అన్నాను. కానీ అతడు వినకుండా వెళ్లిపోయాడు. నేనే డైరెక్ట్‌ చేశాను. ఇదో అర్బన్‌ రొమాంటిక్‌ కామెడీ. క్యూట్‌ లవ్‌స్టోరీ ఆకట్టుకుంటుంది. సంతోష్‌ బెంగళూర్‌లో శిక్షణ తీసుకున్నాడు. గోల్కొండ హైస్కూల్‌ సినిమాకి నాతో కలిసి పనిచేశాడు. ఈ చిత్రంలో తను హీరోగా బాగా నటించాడు. ఈ సినిమాతో పెద్ద విజయం అందుకుంటాడు. అందరి ఆశీస్సులు కావాలి'' అన్నారు. 

రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ -''నేను రామ్మోహన్‌గారిని కలిసినప్పుడు ఓ స్క్రిప్టు ఇచ్చి డైరెక్ట్‌ చేస్తావా? అన్నారు. అవును చేస్తాను అన్నాను. కానీ ఆయన నన్ను హీరోని చేశారు. పరిశ్రమలో ఆయన నాకు గాడ్‌ ఫాదర్‌. సినిమా గురించి సమస్తం తెలిసిన వ్యక్తి. ఈ సినిమా నేను చేయాల్సినది కాదు. సంతోష్‌ చేయాల్సినదే. అతడు బాగా నటించాడు. నేను నటించిన సినిమా చూపిస్త మావ చిత్రానికి ప్యారలల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. హిట్‌ కొట్టాల్సిన సినిమా ఇది. దర్శకత్వం, కెమెరా వర్క్‌ చాలా బావుంది. నీ సినిమా విషయంలో ఒకవేళ నా గెస్సింగ్‌ రాంగ్‌ అయితే నన్ను నేను కరెక్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రామ్మోహన్‌ మరిన్ని మంచి సినిమాలు చేయాలి. నాక్కూడా అవకాశం ఇవ్వాలి'' అన్నారు.
అవికా గోర్‌, సంతోష్‌ శోభన్‌, అల్లరి రవిబాబు, సత్యకృష్ణ, కిరీటి దమ్మరాజు, ఆర్‌.కె. మామ, రాజశ్రీనాయుడు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: సురేష్‌ సారంగం, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఆర్ట్‌: ఎస్‌.రవీందర్‌, నిర్మాణం: సన్‌షైన్‌ సినిమాస్‌ ప్రై. లిమిటెడ్‌, వయాకామ్‌ 18 పిక్చర్స్‌ లిమిటెడ్‌, సమర్పణ: డి.సురేష్‌బాబు, నిర్మాత-దర్శకత్వం: రామ్మోహన్‌ పి. 
« PREV
NEXT »

No comments

Post a Comment