తాజా వార్తలు

Thursday, 12 November 2015

'తను నేను' షూటింగ్‌ పూర్తి

అష్టాచమ్మా, ఉయ్యాలా జంపాలా చిత్రాల నిర్మాత రామ్మోహన్‌ పి. స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'తను నేను' షూటింగ్‌ పూర్తి చేసుకున్నది. అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న రామ్మోహన్‌ పి. ఇప్పుడు దర్శకుడుగా మారారు. అవికా గోర్‌ హీరోయిన్‌గా, 'వర్షం' దర్శకుడు శోభన్‌ తనయుడు సంతోష్‌ శోభన్‌ హీరోగా డి.సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్‌ సినిమా, వయాకామ్‌ 18 పిక్చర్స్‌ పతాకాలపై స్వీయ దర్శకత్వంలో రామ్మోహన్‌ పి. నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'తను నేను' షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను దీపావళి కానుకగా ఈరోజు విడుదల చేశారు. నవంబర్‌ 11 నుండి 'అఖిల్‌' చిత్రంతోపాటు 'తను నేను' ట్రైలర్‌ కూడా ప్రదర్శించబడుతుంది. సన్ని ఎం.ఆర్‌. సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో నవంబర్‌ చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
అవికా గోర్‌, సంతోష్‌ శోభన్‌, అల్లరి రవిబాబు, సత్యకృష్ణ, కిరీటి దమ్మరాజు, ఆర్‌.కె. మామ, రాజశ్రీనాయుడు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: సురేష్‌ సారంగం, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఆర్ట్‌: ఎస్‌.రవీందర్‌, నిర్మాణం: సన్‌షైన్‌ సినిమాస్‌ ప్రై. లిమిటెడ్‌, వయాకామ్‌ 18 పిక్చర్స్‌ లిమిటెడ్‌, సమర్పణ: డి.సురేష్‌బాబు, నిర్మాత-దర్శకత్వం: రామ్మోహన్‌ పి. 
« PREV
NEXT »

No comments

Post a Comment