తాజా వార్తలు

Monday, 9 November 2015

తెలంగాణ కొత్త డీజీపీ పీఠం ఎవరికి దక్కేనో..?

తెలంగాణ డీజీపీ ఎంపిక కోసం ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీ రాష్ట్రానికి పంపిందిరాష్ట్ర డీజీపీ ఎంపికపై ఢిల్లీలోని యూపీఎస్సీలో సమావేశం జరిగింది. సమావేశంలో డీవోపీటీ, హోంశాఖ, యూపీఎస్సీ అధికారులు డీజీపీ ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే డీజీపీ ఎంపికలో భాగంగా ఆరుగురి పేర్లను ప్యానల్ పరిశీలించింది. ఇందులో ముగ్గురి పేర్లతో తుది జాబితాను తయారు చేసింది. తుది జాబితాలో అనురాగ్ శర్మ, ఏకే ఖాన్, అరుణ బహుగుణ పేర్లు ఉన్నాయి. ముగ్గురి పేర్లను ప్యానల్ రాష్ర్టానికి పంపనుంది. ఇక ముగ్గురిలో ఏవరు డీజీపీ అవుతారో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం తాత్కాలిక డీజీపీగా అనురాగ్ శర్మ కొనసాగుతున్నారు.  జాబితాలో సీనియర్ ఐపీఎస్ అధికారులు అరుణా బహుగుణ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్ పేర్లు ఉన్నాయితెలంగాణ ప్రభుత్వం ముగ్గురు అధికారుల్లో ఒకరిని పూర్తి స్థాయి డీజీపీగా నియమించనుంది. తెలంగాణ డీజీపీగా ప్రస్తుతం అనురాగ్ శర్మ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
« PREV
NEXT »

No comments

Post a Comment