తాజా వార్తలు

Thursday, 26 November 2015

మానవ మృగాలు: మైనర్ పై అత్యాచారం-వీడియో తీసి బెదిరింపు!

దేశ వాణిజ్య రాజధానిలో మానవ మృగాలు తమ రాక్షసత్వాన్ని బయపెట్టాయి. మనవ రూపం లో ఉన్న  నాలుగు మృగాలు అభం శుభం తెలియని చిన్నారి పై అత్యాచారం చేశాయి. అంతటితో ఆ మృగాల వేటా ఆగలేదు .. ఆ వికృత చేష్టలను వీడియో తీసి సోషల్ మీడియా లో  అందరికి పంపించి ఆనంద పడ్డాయి. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనతో యావత్ దేశం నిర్ఘాంత పోయింది.నవంబరు 8వ తేదీన ముంబైలో జరిగిన ఈ అమానుషం దాదాపు 15 రోజుల తర్వాత  పోలీసుల దృష్టికి వచ్చింది.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 15,16 ఏళ్ల వయసున్న నలుగురు అబ్బాయిలు పథకం ప్రకారం బాధిత బాలికను పిలిచారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని కంబైన్డ్ స్టడీ పేరుతో ఇంటికి పిలిచారు. ఆ తరువాత అఘాయిత్యానికి పాల్పడి, సెల్ ఫోన్ లో చిత్రించారు. ఎవరికైనా చెబితే వీడియోను బహిర్గతం చేస్తామని బెదిరించారు. దీంతో అమ్మాయి మౌనంగా వుండిపోయింది. కానీ వాళ్లలో ఒకడు దాన్ని  సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అదికాస్తా  బాలిక బంధువుకు చేరింది. దీంతో షాకైన ఆమె.. బాలికను నిలదీయడంతో, జరిగిన అన్యాయాన్ని వివరించింది. ఆమె మలాద్ పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేసింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment