తాజా వార్తలు

Saturday, 7 November 2015

వరంగల్ ఉప ఎన్నికల బరిలో 23మంది అభ్యర్థులు

వరంగల్ లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో 23 మంది అభ్యర్ధులు మిగిలారు. పోటీలో మిగిలిన వారిలో ప్రధాన పార్టీల అభ్యర్ధులు.. టిఆర్ఎస్ నుంచి పసునూరి దయాకర్, కాంగ్రెస్ నుంచి సర్వే సత్యనారాయణ, బీజేపీ నుంచి దేవయ్య, వామపక్షాల అభ్యర్ధి గాలి వినోద్ కుమార్, వైసీపీ నుంచి సూర్యప్రకాశ్ పోటీలో ఉన్నారు. ఇవాళ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత వీళ్లు పోటీలో నిలిచారు. 8 మంది అభ్యర్ధులు నామినేషన్లు ఉపసంహరించుకోగా, ఏడుగురి నామినేషన్లను తిరస్కరించారు. మొత్తం 23 మంది అభ్యర్ధులు పోటీలో మిగలడంతో రెండు ఈవీఎంలు అవసరమవుతాయి. ఈ నెల 21న పోలింగ్, 24న ఓట్ల లెక్కింపు ఉంటుంది.  ఇవాళ్టి నుంచి పోలింగ్‌ స్లిప్పులు పంపిణీ చేస్తామని ఎన్నికల సంఘం రాష్ర్ట ప్రధాన అధికారి భన్వర్‌ లాల్‌ ప్రకటించారు. వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 15 లక్షల 9 వేల 671 మంది ఓటర్లు ఉన్నారని, 1,778 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అవసరమైన ఈవీఎంలను అందుబాటులో ఉంచినమన్నారు. ముగ్గురు అబ్జర్వర్లను నియమించినమని, అవసరమైన చోట లైవ్‌ వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేస్తున్నామని భన్వర్‌ లాల్‌ వెల్లడించారు. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇప్పటివరకు ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ. కోటి 14 లక్షలు సీజ్ చేశామని భన్వర్‌ లాల్‌ తెలిపారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment