తాజా వార్తలు

Saturday, 14 November 2015

వెనకబడ్డ తరగతుల విద్యార్థులకు చేయూత

ఎస్సీ, ఎస్టీ, బీసి విద్యార్థులకు స్టడీ సెంటర్ల ద్వారా పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో జరిగే గ్రూప్‌ పరీక్షలతో పాటు జిఆర్‌ఇ, టొఫెల్‌ తదితర పరీక్షలకు, దేశవ్యాప్తంగా జరిగే ఇతర పోటీ పరీక్షలకు అనుగుణంగా రాష్ట్ర విద్యార్థులను తీర్చిదిద్దేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. విదేశాల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల కోసం అందిస్తున్న సహాయంపై విస్తృత ప్రచారం జరగాలని, సమాజంలోని అత్యంత వెనుకబడిన కుటుంబాలకు చెందిన వారు ఈ పథకాల ద్వారా లబ్ది పొందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌, డిగ్రి కాలేజి హాస్టళ్లు, యూనివర్సిటి హాస్టళ్ల విద్యార్థులకు సన్న బియ్యంతో వండిన అన్నం పెట్టాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. వచ్చే ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఇందుకోసం నిధులు కూడా కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో భోజనానికి, మధ్యాహ్న భోజన పథకానికి రూ. 700 కోట్లు వెచ్చించి సన్నబియ్యం అందిస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మెస్‌ బకాయిలు చెల్లించాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. 2005 నుండి 2014 వరకు మొత్తం రూ. 7 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. వాటిని మొత్తం ఒకేసారి చెల్లించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment