Writen by
vaartha visheshalu
00:50
-
0
Comments
ఎపి రాజధాని గ్రామాల వారికి కొత్త ఆందోళన మొదలైందని వార్తలు వస్తున్నాయి.ఎపి ప్రభుత్వ సచివాలయం నుంచి నేరుగా 16.5 కిలోమీటర్ల రోడ్డు, అది కూడా నాలుగు లైన్ ల రోడ్డు వేయాలని ప్రభుత్వం తలపెట్టడంతో తమ గ్రామాలు ,ఇళ్లు ఉంటాయా,పోతాయా అన్న ఆందోళన చెందుతున్నారని కధనం.ఈ రోడ్డు వంకర ,టింకరగా ఉండడానికి వీలు లేదని, నేరుగా ఉండాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా అబిప్రాయపడినట్లు సమాచారం వచ్చింది.ఈ నేపద్యంలో ఆ రోడ్డు ఎటు వెళుతుంది? ఎంత బూమి పోతుంది?దానికి ఎంత పరిహారం ఇస్తారు?కొద్దిపాటి భూమి ఉన్న వారి పరిస్థితి ఏమిటి?మొదలైన ప్రశ్నలకు జవాబు లేక గ్రామాలవారు ఆందోళన చెందుతున్నారు.200 అడుగుల రోడ్డు తమ వైపు వేస్తే, ఉండవల్లి, పెనుమాక గ్రామాలే ఉండవని ప్రజలు వాపోతున్నారు.రహదారి విషయం మరో రెండు నెలల్లో స్పష్టత వస్తుందని అంటున్నారు.అంతర్జాతీయ రాజధాని ఏమో కాని తమ ఊళ్లమీదకు వచ్చేలా ఉందని గ్రామస్థులు వాపోతున్నారట.
No comments
Post a Comment