తాజా వార్తలు

Friday, 6 November 2015

త్రిపుర రివ్యూ

బబ్లీ క్యారెక్టర్స్ తో కనిపించిన హీరోయిన్ స్వాతి త్రిపుర వెండితెరపై భయపెట్టింది. తొలి సారిగా టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ బ్యూటీ అందుకు తగ్గట్టుగా సినిమాను సక్సెస్ చేయటం కోసం అన్నిరకాలుగా కష్టపడింది. హీరోగా నటించిన నవీన్ చంద్ర తన పాత్ర మేరకు ఆకట్టుకున్నాడు. విలన్ గా రావు రమేష్ మరోసారి తన మార్క్ చూపించాడు. తెలుగు తెర మీద సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా పేరున్న హార్రర్, కామెడీలను మరోసారి అద్భుతంగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు రాజ్ కిరణ్. హర్రర్ సినిమాలో కావాల్సిన అన్ని రకాల థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశాడు. అయితే ఇప్పటికే ఈ జానర్ లో చాలా సినిమాలు రావటంతో పెద్దగా కొత్తదనమేమి కనిపించలేదు. సప్తగిరి చేసిన కామెడీ అక్కడక్కడా బాగానే వర్క్ అవుట్ అయిన చాలా వరకు రొటీన్ గా అనిపించింది. కెమారా వర్క్ సినిమా పరిథి మేరకు ఆకట్టుకున్నా, హార్రర్ సినిమాకు ప్రాణం లాంటి నేపథ్య సంగీతం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. వెలిగొండ శ్రీనివాస్ అందించిన స్క్రీన్ ప్లే సినిమాకు హైలెట్ గా నిలిచింది. చిత్ర దర్శకుడు రాజ్ కిరణ్ తెరకెక్కించిన గత చిత్రం గీతాంజలి ఘన విజయం సాధించటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కథలోకి వెళితే.. త్రిపుర పల్లెటూరిలో ఎంతో ఆనందంగా జీవితం గడిపే అమ్మాయి. ఇక తనకు కాబోయే భార్య ఎలా ఉండాలే ఊహించుకుంటూ కాలం గడుపుతున్న డాక్టర్ నవీన్ చంద్ర. తన ఊహల్లో కనిపించే అమ్మాయిలాగే ఉన్న త్రిపురను చూసి ఇష్టపడ్డ అతడు... ఆమెను పెళ్లి చేసుకొని సిటీకి తీసుకువస్తాడు. ఒక అపార్ట్ మెంట్ లో ఫ్లాట్  అద్దెకు తీసుకొని అక్కడ కాపురం పెడతారు. ఆ తరువాత ఆ ఇంట్లో దెయ్యం ఉందని తెలుసుకున్న ఆ జంట ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ ఇంట్లో నుంచి, ఆ దెయ్యం బారినుంచి ఎలా భయపడ్డారు అన్నదే మిగతా కథ. స్వామిరారా, కార్తీకేయ సినిమాల సక్సెస్ లతో మంచి ఫాంలో ఉన్న స్వాతి మరోసారి అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. 
« PREV
NEXT »

No comments

Post a Comment