తాజా వార్తలు

Thursday, 5 November 2015

భయపెట్టనున్న త్రిపుర

క్రేజీ మీడియా బ్యానర్‌పై స్వాతి, నవీన్‌ చంద్ర జంటగా ‘త్రిపుర’ పేరిట తాజాగా రూపొందించిన హార్రర్‌ ద్రిల్లర్‌ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. లవ్‌, కామెడీ, భయపెట్టే అంశాలు, ద్రిల్లింగ్‌ స్టోరీ ఇందులో ప్రధాన అంశాలుగా ప్రేక్షకులను అలరించనున్నాయి. రాష్ట్రంలో 250 నుంచి 300 ది¸యేటర్స్‌, ఏపీలో 300, మొత్తం 600 ది¸యేటర్స్‌లో దీన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట తెలుగు, తమిళ భాషల్లో నవంబర్‌ 27న సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. అయితే దీపావళి సీజన్‌ ఖాళీగా లేకపోవడం, నవంబర్‌ 6న ఖాళీగా ఉండడం, సినిమా రెడీ అవడంతో విడుదల చేసేందుకు నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. కాగా తమిళంలో మాత్రం నవంబర్‌ 27నే చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘గీతాంజలి’ హార్రర్‌ కామెడీ సినిమా దర్శకుడు రాజ్‌ కిరణ్‌ దర్శకత్వంలో, స్వామిరారా, కార్తికేయల తరువాత స్వాతి నటిస్తున్న చిత్రం ‘త్రిపుర’. 
« PREV
NEXT »

No comments

Post a Comment