తాజా వార్తలు

Tuesday, 24 November 2015

భార్య అన్నమాట బయటకు చెప్పి బుక్కైన అమీర్ ఖాన్

అసహనంపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే లేస్తుంది. అమీర్ వ్యాఖ్యలను మతాలకు అతీతంగా అందరూ ఖండిస్తున్నరు. పలు చోట్ల అమీర్ ఖన్ పై కేసులు కూడా నమోదయ్యాయి. భార్య చెప్పిన మాటలను బయటకు చెప్పేముందు కాస్తైనా ఆలోచిస్తే...బాగుండేదని విశ్లేషకులు బావిస్తున్నరు. 
అమీర్ ఖాన్  వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా తప్పుబట్టారు. దేశాన్ని వీడాలని భావించినట్టు ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ స్వాతంత్ర్య సమరయోధులను కించపరచడమే అవుతుందని ఒవైసీ మండిపడ్డారు. 'మేం ఇండియాను వీడాలనుకుంటున్నామని మాట వరుసకు చెప్పినా అది దేశ స్వాత్రంత్య సమరయోధులకు అపకారం చేయడమే అవుతుంది. విశ్వంలో భూగ్రహం ఉన్నంతకాలం మమ్మల్ని ఎవరూ ఇండియా విడిచివెళ్లిపోమ్మని బలవంతపెట్టలేరు. మేం కూడా విడిచివెళ్లబోమని ఒవైసీ పేర్కొన్నారు.   
హీరోయిన్ రవీనాఠాండన్ ఐతే..అమీర్ ఖాన్ నువ్వు దేశానికి ఏం ఇచ్చావని ప్రశ్నించారు. 
దేశంలోని  అభద్రతా భావం ఉందన్న బాలీవుడ్ ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. ఆమిర్ ఖాన్ కావాలనుకుంటే దేశాన్ని తప్పక వీడి వెళ్లిపోవచ్చునని, ఆయన వెళ్లిపోతే దేశంలో కొంత జనాభా అయినా తగ్గుతుందని ఆదిత్యనాథ్ సూచించారు.
మరోవైపు ముంబైలోని అమీర్ ఖాన్  నివాసం ఎదుట భద్రతను పెంచారు. ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ హిందూసేన కార్యకర్తలు కొందరు ఆయన నివాసం ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు రంగంలోకి భద్రతను పెంచారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment