తాజా వార్తలు

Thursday, 26 November 2015

మళ్లీ తెలుగుదేశం పార్టీ బాటలో ఆ.. సోదరులు

ఆనం సోదరులు మళ్లీ తెలుగుదేశం పార్టీ బాట పట్టనున్నరట. కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పి వారు తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైందిఇందుకు గాను, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి సోదరులు గురువారం నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, కావలి, సర్వేపల్లి, ఆత్మకూరు శాసనసభా నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమయ్యారుతాము త్వరలోనే టిడిపిలో చేరుతామని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఆనం సోదరులు టిడిపిలో చేరుతారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రక్రియ ఇక వేగవంతమైంది. కార్యకర్తలతో భేటీ తర్వాత తాము తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు చేరేది ఆనం సోదరులు నిర్ణయం తీసుకుంటారుచంద్రబాబు తమతో మాట్లాడారని ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. మంత్రి నారాయణతో తమకు విధమైన విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెసు కోలుకోలేని పరిస్థితికి వచ్చిందని ఆయన అన్నారు. అభివృద్ధి కోసం తాము టిడిపిలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వారంలోగా ఆనం సోదరులు టిడిపిలో చేరే అవకాశం ఉంది. మరోవైపు ఆనం సోదరులు టీడీపీలోకి వెళుతున్నారని ప్రచారం జరుగుతుండడంతో వారిపై కాంగ్రెసు పార్టీ నేతలు కస్సుబుస్సుమంటున్నారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment