తాజా వార్తలు

Sunday, 29 November 2015

చింతమనేనిపై విరుచుకుపడ్డా ప్రజా సంఘాలు

ఎపి ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై సిపిఎం ప్రజా సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. అంగన్ వాడీ కార్యకర్తలపై ప్రబాకర్ వ్యవహార తీరుకు నిరసనగా వీరు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి విమర్శలు గుప్పించారు. ప్రభాకర్ వంటి రౌడీలను, క్రిమినల్స్ ను చట్ట సభలకు ఎలా పంపారని నేతలు ప్రశ్నించారు.రౌడీయిజంతోనే ప్రభాకర్ ఎదిగారని,తల్లిదండ్రులను కష్టపెట్టడమే కాకుండా, కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్న చరిత్ర ప్రబాకర్ ది అని వక్తలు ఆరోపించారు.ప్రభాకర్ ఎమ్మెల్యే పదవిలో ఉండడానికి అనర్హుడని, టిడిపికి మహిళలపై ఏ మాత్రం గౌరవం ఉన్నా,ఆయనను అనర్హుడిని చేయాలని డిమాండ్ చేశారు. రౌడీలు, గూండాలతో చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని వారు పేర్కొన్నారు. ఐద్వా అద్యక్షులు రాజ్యలక్ష్మి,విజయలక్ష్మి, బ్రహ్మావతి, బలరాం, జాన్ గుర్నాదం తదితరులు మాట్లాడారు.
« PREV
NEXT »

No comments

Post a Comment