తాజా వార్తలు

Thursday, 26 November 2015

మెగా ఫ్యామిలీ నుండి మరో యంగ్ హీరో

చిరంజీవి మొదలు పెట్టిన నట ప్రస్థానంలో ఎందరో మెగా హీరోలు తెలుగు తెరపై సందడి చేస్తోండగా,మరో యంగ్ హీరో సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్దమయ్యాడు.ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి చిరు,పవన్ ,బన్నీ,చరణ్ ,సాయిధరమ్ ,వరుణ్ తేజ్ ,అల్లు శిరీష్ లు ఎంట్రీ ఇవ్వగా అదే ఫ్యామిలీ నుండి మెగా హీరోయిన్ ఎంట్రీ కూడా ఖరారు అయింది.నాగబాబు కూతురు నిహారిక వెండితెరపై సందడి చేసేందుకు సిద్దం కాగా,మెగా ఫ్యామిలీ నుండి మరో యంగ్ హీరో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు.

ఇప్పటికే టాలీవుడ్ లో మెగా హీరోల హవా ఎక్కువగా ఉండగా,వీరు వరుస సక్సెస్ లను సాధిస్తున్నారు.అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మరో మెగా బాబు రెడీగా ఉన్నట్టు సమాచారం.సినిమా ఫ్యామిలీ కావడంతో ఈ కుర్రాడికి సినిమాలో నటించాలనే ఆసక్తి మరింత పెరిగినట్టు టాక్ .అయితే ఈ కుర్రాడు మరెవరో కాదు వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తోన్న సాయిధరమ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ .గతంలో చిరు నటించిన శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో పేషెంట్ గా నటించిన ఈ కుర్రాడు తన చదువును కొనసాగిస్తూనే మరో వైపు నటన,డ్యాన్స్ ,ఫైట్స్ ఇలా అన్ని కేటగిరీల్లో శిక్షణ పొందుతున్నట్టు తెలుస్తోంది.

తొలి సినిమా విషయంలో ఇప్పటికే మెగా హీరోల సలహ తీసుకుంటున్న వైష్ణవ్ తేజ్,టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో,ఏ రేంజ్ లో ఇస్తాడో అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment