తాజా వార్తలు

Wednesday, 11 November 2015

ఏపీని ముంచేస్తున్న అల్పపీడన ద్రోణి

అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజా జీవనం అతలాకుతలమైంది. ప్రధానంగా నెల్లూరు, చిత్తూరు, తూర్పుగోదావరి, కడప జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతికి చిత్తూరు జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఒకరు గల్లంతయ్యారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. భారీ వర్షాల కారణంగా తిరుమలలో కూడా భక్తులు అనేక ఇక్కట్లకు గురవుతున్నారుకడప జిల్లా రాజంపేటలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల చెరువులకు గండ్లు పడి రోడ్లు దెబ్బతిన్నాయి. రైతుల చేతికొచ్చిన పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు, చీరాల, వేటపాలెం, చినగంజాంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో 11.5 సెం.మీల వర్షపాతం నమోదైంది. కడప జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో రైల్వేకోడూరులో అత్యధికంగా 22.4 సెం.మీల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ఏపీ తీర ప్రాంతాల్లో టపాసుల అమ్మకాలు దారుణంగా పడిపోయాయితిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్నాయి. అటు నడకదారిన వెళ్లే మెట్ల మార్గంలోనూ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో టీటీడీ అధికారులు నాలుగు రోజుల పాటు శ్రీవారి మెట్ల నడకదారిని మూసివేసారు.నడకమార్గంలో విరిగిపడ్డ కొండచరియలను తొలగిస్తున్నారు.

« PREV
NEXT »

No comments

Post a Comment