తాజా వార్తలు

Monday, 9 November 2015

తరుముకొస్తున్న తుఫాన్

ఆంధ్రప్రదేశ్ పైకి తుఫాన్ తరుముకొస్తుంది.  ప్రస్తుతం నైరుతి బంగాళా ఖాతంలో వాయుగుండం స్థిర పడింది. చెన్నైకి260 కిలో మీటర్ల దూరంలో ప్రస్తుతం స్థిరపడిన వాయుగుండం మధ్యాహ్నం తుఫానుగా మారే ప్రమాదం ఉంది. దీంతో తీరప్రాంతాలపై అది విరుచుకుపడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరింది. ఈ రోజు రాత్రి లేదా ఉదయం చెన్నై కారేకల్ తీరం మధ్య పుదుచ్ఛేరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో దక్షిణకోస్తా రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశ ఉందని వెల్లడించింది. దక్షిణ కోస్తాలో తీరం వెంబడి గంటకు 50-55 కిమీ వేగంతో, ఉత్తర కోస్తాలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బలంగా వీచే అవకాశం ఉందన వెల్లడించింది. మత్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ తీర వాసులను, అటు తమిళనాడు తీరవాసులను వాతావరణ కేంద్రం హెచ్చరించింది.   
« PREV
NEXT »

No comments

Post a Comment